V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ భూమిపై ఒకరికి ఒక్క న్యాయం… మరొకరికి మౌనం ఎందుకు? సాలూరులో అధికారుల ద్వంద్వ వైఖరిపై ప్రజల ఆగ్రహం…

SHARE:

టీ కొట్టుకు చట్టం… టిఫిన్ సెంటర్‌కు రాజకీయ రక్షణా?

సాలూరులో అధికారుల ద్వంద్వ వైఖరి బహిర్గతం!

సామాన్యుడిపై కఠిన చర్యలు… పలుకుబడిదారుడిపై మౌనం ఎందుకు?
ప్రభుత్వ స్థలాల కబ్జాల్లో రాజకీయాల నీడ!

చట్టం అందరికీ సమానమేనా? సాలూరులో లేవనెత్తుతున్న ప్రశ్నలు
ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల వైఫల్యం!
ఒకరికి నిబంధనలు… మరొకరికి మినహాయింపులా?
సాలూరులో అక్రమ కబ్జాలపై ఎంపిక చేసిన చర్యలా?

సాలూరు, నిజామాబాద్ జిల్లా:
సాలూరు మండల కేంద్రంలో ప్రభుత్వానికి చెందిన జీపీ స్థలంలో వ్యాపారం నిర్వహిస్తున్నారన్న గ్రామస్తుల ఫిర్యాదుతో ఇటీవల ఓ టీ కొట్టును అధికారులు తొలగించారు. అయితే, అదే ప్రభుత్వ భూమిపై పక్కనే కొనసాగుతున్న టిఫిన్ సెంటర్‌నుఎందుకుతొలగించలేకపోతున్నారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.టీ కొట్టు తొలగించిన వెంటనే, అదే స్థలానికి ఆనుకొని ఉన్న టిఫిన్ సెంటర్‌పై మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడికి రాజకీయ బలం ఉండటం వల్లే అధికారులు ఆ వైపు చూడడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సామాన్యులపై ఒక విధంగా, ప్రభావవంతులపై మరో విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం అందరికీ సమానమా? లేక అధికారుల చర్యలు రాజకీయాల ఆధీనమా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, అక్రమ కబ్జాలపై నిస్సహాయంగా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సాలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, కల్వర్టులు అక్రమ కబ్జాలకు గురికాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో న్యాయం, సమానత్వం కనిపించకపోతే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india