సాలూర : ఇసుక రవాణా కొరకు డిజిటల్ బుకింగ్ నియమ నిబంధనలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయనున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో వెల్లడించారు.మీ డిజిటల్ ఇసుక బుకింగ్ గైడ్ మన ఇసుక రవాణా ప్రక్రియ లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద మండల,గ్రామస్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.డిజిటల్ ఇసుక రవాణా నియమ నిబంధనలు అధికారులకు వివరించారు.అక్రమ ఇసుక రవాణా పూర్తిగా అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎలాంటి తప్పిదాలకు తావునిచ్చిన శాఖా పరమైన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.ఈ నియమాలను ప్రతి ఒక్కరు పాటించి అధికారులు,వినియోగదారులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శశిభూషణ్,ఎంపీడీవో శ్రీనివాస్,గ్రామ పంచాయతీల సెక్రటరీలు,కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








