పుట్టగొడుగుల్లా ఊరురా గల్లి గల్లి లో అర్వత లేని వైద్యులు
వైద్యం పేరుతో భారీగా దోచుకుంటున్న వైనం
అర్హత లేని వైద్యులు డాక్టర్ గా చలామణి అవుతూ చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు వైద్యం పేరుతో భారీగా దండుకుంటున్న వైనం
కనీస సౌకర్యాలు మౌలిక వసతులు లేని ల్యాబ్ లతో జనం విలవిలా
ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనా సేకరణ ప్రైవేటు ల్యాబులల్లో పరీక్షలు భారీగా దండుకుంటున్న వైనం
ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందికి ల్యాబ్ వారితో కన్సల్టింగ్, పర్సంటేజ్ ల వ్యవహారంతో భారీగా ప్రైవేటు ల్యాబులకు తరలిస్తున్న వైనం
అర్హత లేని వైద్యులు పర్సంటేజ్ పేరుతో నిజాంబాద్, బోధన్ తో పాటు పలు పట్టణాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు చికిత్స కోసం
ఆస్పత్రిలోనే బెడ్ల సౌకర్యం ఇతర సౌకర్యాలు ఉన్నాయని భారీగా దండుకోవడం ఇంజక్షన్లు ఇవ్వడం గ్లూకోస్లు ఇవ్వడం, హై యాంటీబయటిక్ టాబ్లెట్ ఇంజక్షన్లు ఇవ్వడం ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడడం పరిపాటి అయిపోయింది
టైఫాయిడ్ ,మలేరియా, ఇతర వ్యాధులు, ఫైల్స్, మండి ,బుడ్డి, అనేక వ్యాధులకు చికిత్సలు ఉన్నాయి అంటూ భారీగా పైసా వసూల్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా సాలుర మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు చేస్తారు రక్తనమనలు సేకరిస్తారు అందులో కొంతమంది సిబ్బంది ప్రైవేట్ ల్యాబ్ లతో కన్సల్టింగ్ అయి పర్సంటేజ్ ల పేరుతో రక్త పరీక్షల కోసం పంపిస్తూ ఉంటారు ఇక ల్యాబుల పరిస్థితి మౌలిక వసతులు ఉండవు ఏమి ఉండవు భారీగా దండుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ, ఇది ఇలా ఉంటే సాలుర మండల కేంద్రంతో పాటు సాలూరు మండలంలోని పలు గ్రామాలలో అర్హత లేని వైద్యులు చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని వ్యాధులకు ప్రథమ చికిత్సల పేరుతో ఆసుపత్రిలోనే బెడ్ల సౌకర్యం ఇంజక్షన్ సౌకర్యం, హాయ్ ఆంటీ బయోటిక్ టాబ్లెట్స్ హాయ్ ఆంటీ బయటికి ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటి అయిపోయిందని ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు, ఒక్కసారి మండల కేంద్రమే కాదు బోధన్ పట్టణంలో సుమారు 29 ఆసుపత్రుల పరిస్థితి ఇంతే, ఒక్క ఆసుపత్రి పై చర్యలు తీసుకున్నారు మిగతా ఆసుపత్రిలో భారీగా దండుకుంటున్నారు మరి వాటిపై చర్యలు లేవా అని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, ఇకపోతే వర్ని మండల కేంద్రంతో పాటు రుద్రూరు మండల కేంద్రంతో పాటు, కోటగిరి ,పోతంగల్, ఈ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలు విడిగా పుట్టగొడుగుల అర్హత లేని వైద్యులు, వైద్యులుగా చలామణి అవుతూ తెలిసి తెలియని వైద్యం పేరుతో మందులు ఇస్తూ భారీగా ప్రజలు దండుకుంటున్నారని ప్రధాన విమర్శ వినిపిస్తుంది, ఇకపోతే మలేరియా టైఫాయిడ్ ఇతర వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు అంటూ భారీగా దండుకుంటున్నారనేది ప్రధాన విమర్శ, మూస్రా మండల కేంద్రంలో పలు వ్యాధులకు చికిత్సలు చేస్తామంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేరుతో తెలిసి తెలియని వైద్యులు ఆసుపత్రిలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ అంటూ ఇంజక్షన్లు గుల్కోస్లు ఇవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని కొన్ని ఏళ్ల క్రితం ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనలో సుమారు పది లక్షల వరకు జరిమానా విధించిన వైనం కూడా ఉందని అనుమానాలు విమర్శలు వినిపిస్తున్నాయి, ఇకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఆయుర్వేదిక్ సర్టిఫికెట్ లేకుండా అన్ని వ్యాధులకు చికిత్సలు ఉన్నాయి అంటూ భారీగా మందులు ఇస్తూ జనాలకు మోసం చేస్తున్నారని ప్రధాన టాక్, ఈ మధ్యకాలంలో జిల్లా వైద్య శాఖ అధికారిని చందూరు మండల కేంద్రంతో పాటు బోధన్ పట్టణంలో ఒక ఆసుపత్రి పై చర్యలు తీసుకున్నారని మిగతా గ్రామాలు పట్టణాల్లో మండల కేంద్రాల్లో ఉన్న నిబంధనకు విరుద్ధంగా కొనసాగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రుద్రూరు మండల కేంద్రంతో పాటు పలు మండలాల్లో మండి, ఫైల్స్, బుడ్డి, పలు వ్యాధులకు ఆపరేషన్ లేకుండా చికిత్సలు చేస్తామంటూ భారీగా దండుకుంటున్నారని చందూరు మండల కేంద్రంలో నిజామాబాదు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ వ్యాధులకు ఆపరేషన్ లేకుండా చిక్సలు చేస్తామంటూ బెడ్ల సౌకర్యం ఏర్పాటు చేస్తూ తెలిసి తెలియని వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడిన పరిస్థితులు ఉన్నాయని వీటిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు, జిల్లా వైద్యశాఖ అధికారులు చందూరు మండల కేంద్రంతో పాటు బోధన్ పట్నంలోని ఒక ఆసుపత్రి పైన చర్యలు తీసుకున్నారని జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు,
వర్ని మండల కేంద్రంలో భీమ్రావు అనే వైద్యులకి వయసు అయిపోయిందని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికి బందు చేయలేదని ప్రజలు అంటున్నారు.
ఇలాంటి వారికి కొంతమంది రాజకీయ నాయకులు అండదండలు ఉంటూ వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తూ అధికారులపై వేటు వేయడానికి అదేవిధంగా వారితో కమిట్మెంట్ అయి వీరికి సపోర్ట్ చేస్తున్నారని ఇది సమంజసం కాదని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారికి రాజకీయ నాయకులు అండదండలు ఏమిటని రాజకీయ నాయకుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలో పుట్టబోడుగుల వెలిసిన నిబంధన విరుద్ధంగా వెలిసిన ఆసుపత్రులు, ఆసుపత్రి వైద్యులు ఫైల్స్ మండి బుడ్డి వంటి వాటికీ అదేవిధంగా పురుషుల అండాశయంలో నీళ్లు వస్తే ఇంజక్షన్ ఇచ్చి అనగా వైద్య శాఖలో నిబంధన విరుద్ధంగా ఇంజక్షన్ ఇచ్చే నీళ్లు తీయడం ఇవన్నీ క్యాన్సర్ ఇతర రోగాలకు కారణమయ్యే విధంగా ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడే విధంగా చికిత్సలు ఇవ్వడం చాలా ఖతర్నాక్ అని దీనిపై జిల్లా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఇలా కొనసాగుతున్నప్పటికీ నసుల్లాబాద్ మండల కేంద్రంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రజలు అంటున్నారు, అదే విధంగా మలేరియా టైఫాయిడ్ తో పాటు పలు వ్యాధులకు చికిత్సలు చేస్తున్నామంటూ నసుల్లాబాద్ మండల కేంద్రంలో కొంతమంది వైద్యులు తెలిసి తెలియని వైద్యం అనగా హై యాంటిబయాటిక్ ఇంజక్షన్ గ్లూకోస్లు టాబ్లెట్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని భారీగా దండుకుంటున్నారని వీటి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామం తో పాటు వివిధ గ్రామాల్లో వర్ని మండలం కు చెందిన వైద్యుడు వచ్చి తెలిసి తెలియని వైద్యం ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని వైద్యులుగా చలమని అవుతూ మెడికల్ వ్యవస్థ నడుపుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు వీటన్నింటిపై జిల్లా శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి విచారణ చేసి ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు మోసపోకుండా ప్రజల జేబులకు చిల్లు పడకుండా భారీగా మోసపోకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
తెలిసి తెలియని వైద్యులు పుట్టగొడుగుల వెలవడమే కాకుండా మెడికల్ వ్యవస్థ నడుపుతూ అంటే సర్టిఫికెట్లు ఇతర పేరుపై ఉంచుతూ అంటే ఆ సర్టిఫికెట్లను కొనుగోలు చేసి సంవత్సరానికి లేక నెలకు డబ్బులు ఇస్తూ మెడికల్ వ్యవస్థను నడిపిస్తున్నారని అధిక రేట్లకు మందులు విక్రాలు చేయడమే కాకుండా నిబంధనకు విరుద్ధంగా మందులు విక్రాలు చేస్తూ భారీగా దండుకుంటున్నారనేది విమర్శ ఉంది, అంతేకాకుండా ఎవరైనా గర్భం పోయే టాబ్లెట్లు ఇవ్వాలని పోతే వారికి సుమారు 1500 నుంచి ఆపై రూపాయలు అనగా 2000 ,5000 వరకు డబ్బులు వసూలు చేసుకుని టాబ్లెట్లు ఇస్తున్నారని నిబంధనకు విరుద్ధంగా ఈ టాబ్లెట్ ఇవ్వడమే కాకుండా ఇతర టాబ్లెట్లు ఇతర హై యాంటీబయటిక్ టాబ్లెట్లు ఇస్తున్నారని విమర్శలు లేకపోలేదు, ఇలాంటివి ఈ సంఘటనలు భారీగా జరుగుతున్నప్పటికీ వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా పట్టణాలలో ఉన్న పెద్ద డాక్టర్ల వద్దకు పర్సంటేజ్ ల పేరుతో రోగులకు పంపిస్తూ, ప్రజలకు మోసం చేస్తున్న వైనం నెలకొంటుందని పలువురు అంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








