ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా రైల్వే గేట్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో రైల్వే గేట్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా రైల్వే గేట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం సుమారు కొన్నిసార్లు రైల్వే గేటు వేయడం జరిగిందని, ఒకసారి రైల్వే గేటు వేసినప్పుడు సుమారు గంటకు పైగా గేటు వేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని వాహనపుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పాలకులు మారుతున్నప్పటికీ సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం తప్ప ఎన్నికల ముందు ఇచ్చే హామీలు హామీలుగానే ఉంటున్నాయి తప్ప సమస్య పరిష్కారంలో ఆచరణలో సఫలం కావడం లేదని పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రోజు రోజుకు ఈ సమస్య మాత్రం అధికమవుతుందని ట్రాఫిక్ అంతరాయం తీవ్రంగా ఏర్పడుతుందని ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడంలో ఒకరు లేక ఇద్దరు సిబ్బంది ఉండటం వల్ల కంట్రోల్ కష్టతరమవుతుందని దీనిపై కూడా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








