గత నెల కామారెడ్డిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో నిర్మల్ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థి కులకర్ణి కె. అర్నావ్ (పదవ తరగతి)ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఘనంగా అభినందించారు.

బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థి అర్నావ్‌తో పాటు ఆయన గైడ్ టీచర్ దత్తాత్రిని కలెక్టర్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థి ప్రతిభను ప్రశంసించిన కలెక్టర్, ఇటువంటి విజయాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) భోజన్నతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








