– బిఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
– కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అసమర్ధ పాలన జరుపుతుందని ఎద్దేవా
– ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు ప్రధాన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి అమలు పరచాలని ఘాటు విమర్శలు
– కేటీఆర్ సేన బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షులు యం.డి. అఫ్రోజ్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్ జనవరి (28), కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో మంగళవారం రోజు బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నూతన సంవత్సరం క్యాలెండర్ లను మరియు డైరీలను కేటీఆర్ సేన బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షులు యం.డి. అఫ్రోజ్ స్థానిక నాయకులు మరియు కార్యకర్తల తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి భవిష్యత్తులో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలు మరియు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో అత్యధిక స్థానాలలో గెలుపొంది బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రగల్బాలు పలికి ప్రజలను మోసగించి తెలంగాణ రాష్ట్రంలో అసమర్ధ పాలన జరుపుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు ప్రధాన హామీలపై ప్రభుత్వం దృష్టిసారించి త్వరితగతిన అమలు చేయాలని ఘాటుగా విమర్శించారు. లేనియెడల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల సీనియర్ నాయకులు గంపల శంకర్, జె. సాయిలు, గైని భూమేష్, షేక్ అయ్యూబ్, మొండి శంకర్, శివ రాములు, నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








