V1News Telangana

best news portal development company in india

సాలూర తహసిల్దార్ శశిభూషణ్‌కు అరుదైన గౌరవం

SHARE:

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం ప్రదానం

నిజామాబాద్: సాలూర మండల ప్రజలకు నిస్వార్థంగా, సమర్థవంతంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సాలూర తహసిల్దార్ శశిభూషణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి తహసిల్దార్ శశిభూషణ్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటించడం, సమస్యల పరిష్కారంలో వేగవంతమైన చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో తహసిల్దార్ శశిభూషణ్ చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన సేవలు ఇతర అధికారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
ఈ సందర్భంగా సాలూర మండల ప్రజాప్రతినిధులు, మండల ప్రముఖులు, గ్రామాల పెద్దలు మరియు స్థానిక ప్రజలు తహసిల్దార్ శశిభూషణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తూ, ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
తహసిల్దార్‌కు లభించిన ఈ గౌరవం సాలూర మండలానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india