– కామ్ శెట్ పల్లి గ్రామ యువకులకు కబడ్డీ పోటీల నిర్వహణ
– యువకులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని పలు సూచనలు
– క్రీడలతో శారీరక దారుఢ్యం మరియు ఆరోగ్యం సంప్రదిస్తాయని
– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్ జనవరి (27)కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం కామ్ షెట్ పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ సున్నం సాయిలు గ్రామంలో గల యువకులకు క్రీడలలో ప్రోత్సహించడానికి తన స్వంత ఖర్చులతో ఆదివారం రోజు ప్రో కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు. కబడ్డీ పోటీలలో గ్రామంలోని పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. పోటీలో పాల్గొని గెలుపొందిన జట్ల సభ్యులకు గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మరియు గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ లు ప్రథమ మరియు ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ యువకులు చదువులతోపాటు, క్రీడలలో కూడా రాణించాలని పలు సూచనలు చేశారు. అలాగే ప్రతి ఒక్క భారతీయ పౌరులు దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. యువకులు ఇదేవిధంగా క్రీడలలో నైపుణ్యంతో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కబడ్డీ పోటీల నిర్వహణకు సహకరించిన గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యువకులు మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు మరియు క్రీడల పట్ల ఇలా పలు విషయాలలో చురుకుగా పాల్గొంటూ అందరికీ ప్రోత్సాహంగా వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కామ్ షెట్ పల్లి గ్రామ సర్పంచ్ సాయా గౌడ్, ఉపసర్పంచ్ రామ్మోహన్, వార్డ్ మెంబర్ లు, గ్రామ పెద్దలు చీకోటి జగదీష్, మేదరి శంకర్, పెద్ద కాపు శంకర్, అరవింద్ గౌడ్, చీకోటి నాగరాజు, ఎం. రాఘవులు, దస్తగిరి పటేల్, మునీర్, హనుమాన్ దేవాలయ కమిటీ అధ్యక్షులు శివరాత్రి వెంకటి, ఉపాధ్యక్షులు వడ్ల భాస్కర్, ముఖ్య సలహాదారులు తోట మోహన్, ప్రతాప్ గౌడ్, సభ్యులు మేదరి సాయిలు, క్రాంతి వీర్, సందీప్, ప్రసాద్, డీజే మహేష్, సాయి తేజ, ధర్మ తేజ, పవన్ కుమార్, ఓర్సు శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








