– భారీ జాతీయ పతాకంతో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు
– ముఖ్యఅతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ నిర్వహించిన మాజీ కౌన్సిలర్ ముప్పా రామారావ్
– పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు
– విద్యార్థులకు చదువుతోపాటు, ప్రతి ఒక్క భారతీయునిలో దేశభక్తి పెంపొందాలని సూచనలు
– పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సత్య కల్లూరి
మేడ్చల్ ప్రతినిధి:
V1 న్యూస్ జనవరి (27) మేడ్చల్ జిల్లా: కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో సిద్దార్థ నగర్‌లో గల శ్రీ సాయి సిద్దార్థ హై స్కూల్ లో సోమవారం రోజు మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరి సత్య ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్.. దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముప్పా రామ రావ్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో గణతంత్ర దేశంగా అవతరించిందని, అదే రోజును జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిన మహాగ్రంథమని వారు పేర్కొన్నారు.భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన శిల్పిగా నిలిచిన డా. బీఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ చట్టపరమైన సూత్రాలను సమన్వయం చేస్తూ భారతదేశానికి అనుకూలమైన రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను రాజ్యాంగంలో కేంద్రబిందువుగా నిలిపారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల రక్షణకు రాజ్యాంగం బలమైన ఆధారంగా మారేలా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థిని–విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటుతూ ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక నృత్యాలు, నాటికలు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు.ప్రత్యేక ఆకర్షణగా సుమారు 3 కిలోమీటర్ల మేర భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను అమితంగా ఆకట్టుకొని కన్నులపండుగగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరి సత్య మాట్లాడుతూ 1876 లో రచించబడిన ఈ మహా జాతీయ గీతం ఈ సంవత్సరంతో 150 వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పటికీ భారతీయుల హృదయాల్లో దేశభక్తి ఉత్సాహాన్ని పెంపొందిస్తూ నిత్య నూతనంగా వర్ధిల్లుతుందని పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతను గుర్తుచేస్తూ పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను చూసి ముగ్ధులైన తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ఆలపించిన వందేమాతరం గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు గాను విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి మరియు సిబ్బందికి మేనేజింగ్ డైరెక్టర్ సత్య కల్లూరి కృతజ్ఞతలు తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








