V1News Telangana

best news portal development company in india

బ్లూమింగ్ బడ్స్ స్కూల్, బోధన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

SHARE:

 

బోధన్ పట్టణంలోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్‌లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణమేరీ గారు హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫయాజ్ అలీ గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశారు. అనంతరం ముఖ్య అతిథి స్వర్ణమేరీ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలు, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ శ్రీధర్ గౌడ్ గారు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india