నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపురం గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి మచ్కూరి రాజేష్ ఇటీవల సూర్యాపేట జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటనతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా TRESA అధ్యక్షులు రమన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆ పిలుపుకు స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు, GPOల సహకారంతో రూ.1,00,000/- (లక్ష రూపాయలు) నిధిని సమకూర్చారు. జిల్లా TRESA ఆదేశాల మేరకు ఈ రోజు మృతుని నివాసానికి వెళ్లి ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో TRESA జిల్లా ఉపాధ్యక్షులు శశి భూషణ్, బోధన్ డివిజన్ కార్యదర్శి నజీరుద్దీన్, కోటగిరి తహసిల్దార్ గంగాధర్, వర్ని తహసిల్దార్ సాయిలు, నాయబ్ తహసీల్దార్ మధు, బోధన్ మరియు కోటగిరి ఆర్‌ఐలు, నిజామాబాద్ జిల్లా GPO అధ్యక్షులు బియ్య సాయినాథ్, కార్యదర్శి గున్నం సంతోష్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు యుగంధర్, జిల్లా నాయకులు నిరడి రమేష్, నిరడి రాజేశ్వర్, గంగాధర్, నవీన్ గంగాధర్‌తో పాటు పలువురు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
మన సహోద్యోగి కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రతి రెవెన్యూ ఉద్యోగి సోదరి–సోదరులకు జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








