V1News Telangana

best news portal development company in india

మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు రెండు జిల్లాల మంజీరా నుంచి ఇసుకను దోచుకుపోతున్నారు

SHARE:

కామారెడ్డి జిల్లా సిర్పూర్ మంజీరా నుంచి పొతంగల్ మండలం కోడిచెర్ల మంజీరా నుంచి ప్రతిరోజూ మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు ఇసుకను చోరీ చేసుకొని పోతున్నారు

ఉమ్మడి నిజామాబాద్

కామారెడ్డి జిల్లా సిర్పూర్ మంజీరా వాగు నుంచి అదేవిధంగా పొతంగల్ మండలం నిజామాబాద్ జిల్లా కొడిచెర్ల మంజీరా వాగు నుంచి ప్రతిరోజు ఇసుక మాఫియా దారులు మద్నూర్, టాక్లి , లింబూరు మీర్జాపూర్ మీదుగా మహారాష్ట్రకు ఇసుక మాఫిదారులు ప్రతిరోజూ ప్రత్యేక వాహనాలలో ఇసుకను దొంగలించి తీసుకుపోతున్నారు తెలంగాణ మంజీరా ఇసుకను మహారాష్ట్ర ఇసుక మాఫియాధారూలు ప్రతిరోజు రాత్రిపూట భారీగా దొంగలించుకొని తీసుకొని పోతున్నారు దీనిమీద బాన్సువాడ సబ్ కలెక్టర్ బోధన్ సబ్ కలెక్టర్ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు తెల్ల ఇసుక బంగారంతో సమానం అయిన ఇసుకను భారీగా చోరీ చేసుకుని తీసుకుపోతున్నారు లోకల్ గా ఉన్న కొంతమంది వారికి సపోర్ట్ చేసి మామూలు తీసుకోవడం వల్లనే ఈ ఇసుక మాఫియా ప్రతిరోజూ పెట్రేగి పోతుందని దీనిపై నిగా పెట్టాల్సిన అవసరం ఉందని వాల్టా చట్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు ప్రతిరోజు రాత్రి రోజు రోజుకు రెచ్చిపోతున్నారని వారి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india