V1News Telangana

best news portal development company in india

లయన్స్ వారి సేవలు చిరస్మరణీయం.

SHARE:

 

✍️ లయన్స్ వారికి మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి.
✍️ అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించడం అభినందనీయం.
✍️ లయన్స్ వారు అందరికీ ఆదర్శప్రాయులు.
✍️ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి.

బోధన్ : బోధన్ లయన్స్ వారి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు,మాజీమంత్రి,బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,లయన్స్ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అతిథులను లయన్స్ ప్రతినిధులు బసవేశ్వర రావు,లక్ష్మీ మరియు ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి జనరల్ ఆసుపత్రిని నెలకొల్పడం సంతోషదాయకమన్నారు.ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు.మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సైతం వైద్యాన్ని చేరువచేస్తూ ప్రజల గుండెల్లో లయన్స్ వారు నిలిచిపోయారన్నారు.అదేవిధంగా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైనవి వైద్యాన్ని అందించడంతో పాటు నిరాశ్రయులకు ఉచితంగా భోజనాన్ని అందించి ఆకలి తీరుస్తున్నారని గుర్తు చేశారు.ఇలాంటి అనేక సేవలను లయన్స్ వారు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.లయన్స్ వారు చేస్తున్న సేవలకు మేము సైతం తోడుగా ఉంటూ మా వంతు సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా ముందుంటామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,లయన్స్ ప్రముఖులు,ప్రతినిధులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india