– క్యాలెండర్ ప్రతులను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
– సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్ జనవరి (24) కామారెడ్డి జిల్లా : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రయాణ ప్రాంగణం ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నూతన సంవత్సరం (2026) క్యాలెండర్ ప్రతులను మరియు డైరీ లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ పార్టీ తరపున ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాడిపంటలు సమృద్ధిగా పండి సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు. అనంతరం ప్రజలకు నూతన సంవత్సర క్యాలెండర్ లను మరియు డైరీలను పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు అందించిన సుపరిపాలన, సాధించిన అభివృద్ధి తాలూకు జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉండాలని కోరుకుంటూ గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ప్రతులను మరియు డైరీలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు టేకుర్ల సాయిలు, మైలారం గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్, వెంకట్ సార్, లక్ష్మణ్, రమేష్,శ్రీను, కుమార్, మామిడి భూమయ్య, దేశ్ పాక్ సాయిలు, చుంచు శేఖర్, గంగాధర్, పెర్క కృష్ణ, గంగారాం,సాయిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








