బోధన్ పట్టణంలోని RTO కార్యాలయంలో RTO శ్రీనివాస్‌కు PDSU(S) జిల్లా అధ్యక్షుడు యన్. బాల్‌రాజ్, TSP జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్‌లు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బోధన్ పట్టణం మరియు డివిజన్ పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న స్కూల్ బస్సులు, వ్యాన్‌లను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

గురువారం శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌కు చెందిన వ్యాన్ అదుపుతప్పి రోడ్డుపై నుంచి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన విద్యార్థుల ప్రాణాలపై ఎంతటి నిర్లక్ష్యం జరుగుతోందో స్పష్టంగా చూపుతోందన్నారు. ఇలాంటి ఘటనలు బోధన్‌లో ఇదివరకే పలుమార్లు పునరావృతమయ్యాయని, అయినప్పటికీ కొందరు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పిల్లల భద్రతను పక్కనపెట్టి ఫీజుల వసూలే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.
ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్డుపై తిరగడం అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమేనని, ఇది మానవహక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కావున RTO వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని స్కూల్ బస్సులు, వ్యాన్‌లను సీజ్ చేయాలని, బాధ్యులైన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








