సాలూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ ఉందా లేదా సచ్చిపోయిందా అనే స్థాయిలో స్థానిక నాయకుల నిర్లక్ష్యం ఉందని ఖాజాపూర్ అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మండల కేంద్రంలో మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు.

కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలుగా నిలిచే కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టి, సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. “నేను పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డాను. అయినా నాకే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనం” అని ఖాజాపూర్ అనిల్ పేర్కొన్నారు.
పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని, ప్రతి కార్యకర్తకు సమాన గౌరవం, సమాచారం అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో బాధ్యులైన నాయకులపై బోధన్ ఎమ్మెల్యే మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న కార్యకర్తలను విస్మరించకుండా, సమన్వయంతో పని చేయాలని, అప్పుడే పార్టీ ప్రజల్లో మరింత విశ్వసనీయత పొందుతుందని ఖాజాపూర్ అనిల్ సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








