V1News Telangana

best news portal development company in india

ఖాజాపూర్‌లో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ – 5 మంది లబ్ధిదారులకు అందజేత

SHARE:

తెలంగాణ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఖాజాపూర్ గ్రామంలో గురువారం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల కింద 5 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు మందన్న రవి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో భరోసా కలిగిస్తున్నాయని, ప్రతి అర్హుడికి పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఖాజాపూర్ అశోక్, ఛిద్రపు రమేష్, చింతం బాలు తదితరులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india