పేకాటకు చెక్… CCS మెరుపు దాడి!
సిర్నాపల్లి శివారులో పేకాట స్థావరం బద్దలు
పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు – పోలీసుల హెచ్చరిక
నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
చట్టాన్ని లెక్కచేయని పేకాటరాయుళ్లకు గుణపాఠం
నిజామాబాద్, జనవరి 20:
పేకాట వంటి అక్రమ కార్యకలాపాలతో ప్రజల జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఇలాంటి వాటిపై పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం చూపబోమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు నగరంలో అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా CCS బృందం మెరుపు దాడులు కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో, నేడు సాయంత్రం CCS ఏసీపీ ఇన్‌చార్జ్ శ్రీ మస్తాన్ అలీ గారి సూచనలతో ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, ఎస్‌ఐ గోవింద్ మరియు సిబ్బంది కలిసి నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి శివారులో నిర్వహించిన దాడిలో పేకాట స్థావరం బయటపడింది. అక్కడ పేకాట ఆడుతున్న ఆరు మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 6 సెల్‌ఫోన్లు, నగదు రూ.28,650/- మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వారిని మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని, వీటికి పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత మరియు ప్రజలు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








