“విజేతగా నిలవాలంటే ప్రణాళిక అవసరం” – డాక్టర్ ఎస్. విఠల్
SAT సూత్రాలతో లక్ష్య సాధన సాధ్యం – డాక్టర్ శ్రీనివాస్
ఎక్స్పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వెల్లువ
ఐఐటీ, ఎన్‌ఐటీ అవకాశాలపై అవగాహన కల్పించిన నిపుణులు.
సాలూర:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరలో విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే విధంగా ఎక్స్పర్ట్ టాక్ – కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ సెషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీయూకేటీ బాసర్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్. విఠల్ గారు, సైకాలజిస్ట్ మరియు కౌన్సిలర్ డాక్టర్ శ్రీనివాస్ గారు హాజరై విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం అందించారు.
డాక్టర్ ఎస్. విఠల్ గారు “విన్నర్స్ ఫిలాసఫీ” అంశంపై మాట్లాడుతూ, విజేతగా నిలవాలంటే స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ, కఠిన శ్రమ తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రొజెక్టర్ సహాయంతో విజేతకు కావలసిన లక్షణాలను వివరించారు. వ్యక్తిగతంగా భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగితే ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించగలడని అన్నారు. చదువుకోడానికి పేదరికం అడ్డుకాదని, ప్రతిభ ఉంటే దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో అవకాశాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, జాతీయస్థాయి పరిశోధన విశ్వవిద్యాలయాల్లో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, లక్ష్య సాధనకు SAT – Specific (స్పష్టత), Achievable (సాధ్యసాధ్యత), Time-bound (సమయపరిమితి) ఎంతో అవసరమని వివరించారు. ఏ విషయాలను వదిలించుకోవాలి, వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, లభించిన సమయాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై మార్గనిర్దేశం చేశారు. చదువుకునే సమయంలో ఏకాగ్రత ఎలా సాధించాలో ఫోన్ ద్వారా చేసిన చిన్న ప్రయోగాత్మక చర్యతో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సాలూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి రాజీ మంజూష గారు మాట్లాడుతూ, విద్యార్థులు ముఖ్య అతిథులు సూచించిన మార్గదర్శకత్వాన్ని జీవితంలో అమలు చేయాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయుల మాటలను పాటించాలి, క్రమశిక్షణతో చదువుకుంటే తప్పకుండా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పురాణే విజయ్ కుమార్, శోభారాణి, లింబగిరి జ్యోత్స్న, గంధం సాయిలు, రుద్ర సంతోష్ యాదవ్, దండు రాజ్ కుమార్, సుధారాణి, విజయలక్ష్మి, విట్టల్ కాంబ్లే, అబ్బయ్య, లక్ష్మి, వనజ, స్వర్ణ మేడి రవి, అక్షయ్ కుమార్ జాదవ్ తదితరులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ ఎక్స్పర్ట్ టాక్ సెషన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి భవిష్యత్ లక్ష్యాలకు స్పష్టమైన దారిని చూపిన ప్రేరణాత్మక కార్యక్రమంగా నిలిచింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









