– గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో అడుగులు వేస్తున్న సర్పంచ్
– ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మెరుగైన ప్రణాళికలతో అహర్నిశలు కృషి చేస్తున్న వైనం
– మైలారం గ్రామ సర్పంచ్ కొలిమి బాల హరిశ్చంద్రా రెడ్డి
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్ జనవరి ( 21) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ సర్పంచ్ కొలిమి బాల హరిశ్చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రోజు మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ మరియు (MDO) రవీశ్వర్ గౌడ్ మైలారం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామంలో గల పల్లె ప్రకృతి వనాన్ని, నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను ప్రతి మొక్క బ్రతికే విధంగా మొక్కలకు సమయానుకూలంగా నీరు అందించాలని.. తద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా పెరిగి పల్లె ప్రకృతి వనం ఆకర్షణీయంగా కనిపించడంతోపాటు ప్రజలకు ప్రాణవాయువు కూడా లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైలారం పంచాయతీ కార్యదర్శి సవిత, మాజీ సర్పంచ్ సాయిరాం, గ్రామస్థులు గడ్డం సాయిలు, లింగం గౌడ్, బొట్టె రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








