ప్రమాదాల నివారణే లక్ష్యంగా బ్లాక్ స్పాట్స్ అవగాహన దినం
యువత ట్రాఫిక్ నియమాలు పాటిస్తే అనేక ప్రాణాలు రక్షించవచ్చు.
నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు, జిల్లా నిజామాబాద్ సాలుర మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రమాదకర ప్రాంతాల అవగాహన దినం (బ్లాక్ స్పాట్స్ డే)ను నిర్వహించారు. ఈ కార్యక్రమం సాలుర మండలంలోని హుంసా జంక్షన్ బ్లాక్ స్పాట్ వద్ద ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ, ప్రమాదాలకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాల్లో బాధిత కుటుంబాలు, ప్రయాణికులు, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ, ప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండటం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని, అలాగే అధిక వేగం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను అలవరుచుకుని రోడ్డు భద్రతకు తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రోడ్డు భద్రతపై సమాజంలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









