తెల్ల రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనతప్ర
భుత్వ బడుల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య – ఎమ్మెల్యే
సాలంపాడ్‌లో నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభం
సాలూర : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనా పైసా కూడా తీసుకోకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో మంగళవారం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క కొత్త లబ్ధిదారునికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందని, అదే వారి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అందిస్తోందని తెలిపారు.
ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. చక్కగా బోధన చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివున్న పరిస్థితుల్లో రైతులు పంటల మార్పిడి చేసుకుని ఫామ్ ఆయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి మంచి లాభాలు పొందాలని ఆయన సూచించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సాలంపాడ్ గ్రామ సర్పంచ్ శీలం నర్మదా సంతోష్ రెడ్డి గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన పి.సుదర్శన్ రెడ్డి కొన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల తరపున సర్పంచ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్పంచ్ దంపతులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాని, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ శశిభూషణ్, ఇల్తెపు శంకర్, అల్లె జనార్ధన్, అల్లె రమేష్, శివకాంత్ పటేల్, బాలకృష్ణారెడ్డి, సంతోష్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









