బోధన్ పట్టణంలో రాబోయే కౌన్సిలర్ ఎన్నికలు ఇప్పుడు నిజమైన రియల్ టైమ్ ఎలెక్షన్ ఫీల్డ్‌గా మారిపోయాయి. తాజాగా వచ్చిన రిజర్వేషన్ ఫలితాలు కొందరి అభ్యర్థులకు గట్టి షాక్ ఇచ్చాయి. తమకు అనుకూలంగా రాకపోవడం వల్ల కొందరు అభ్యర్థులు తీవ్ర నిరాశలో పడగా, మరికొందరు ప్రత్యామ్నాయ వార్డుల్లో పోటీ కోసం దిమ్మ తిరిగిస్తున్నారు.
మూడు ప్రధాన పార్టీలు – MIM, BRS, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠభరిత పోటీ కొనసాగుతోంది. ప్రతి పార్టీ వ్యూహాలు మార్చుకుంటూ, అభ్యర్థులు కొత్త ప్రణాళికలు, కౌంటర్ మూవ్‌లు సిద్ధం చేస్తున్నారు. స్థానిక నేతలు, మద్దతుదారులు ఈ పరిణామాన్ని ఆసక్తిగా పర్యవేక్షిస్తున్నారు.
తాము గెలుపు ఖాయం అని భావించిన అభ్యర్థులకు ఇది పెద్ద షాక్ తగిలింది. రిజర్వేషన్ తరుమరావడం తో వారు మరో వార్డు లో ప్రజల మద్దతు పొందగలరా లేదా తిరస్కరించబడతారో వేచి చూడాల్సి ఉంది.
ఇకపుడు చైర్మన్ పిట్టం మహిళ శక్తి మరోసారి తన ఆధిపత్యాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బోధన్ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితం, ప్రతి అభ్యర్థి, పార్టీ, మద్దతుదారులు రియల్ టైమ్ సమరంలో వ్యూహాలను పునర్వ్యవస్థీకరిస్తున్నారు.
ప్రతీ పరిణామం, ప్రతి ఫలితం ఈ సమరాన్ని మరింత వైవిధ్యభరితంగా, రియల్ డ్రామా ఫీలింగ్ తో మలిచిపెడుతోంది. చివరి గెలుపు ఎవరిదో ఇంకా స్పష్టంగా లేదు. బోధన్ పట్టణం ఇప్పుడు నిజంగా రియల్-టైమ్ పాలిటికల్ మైదానంగా మారిపోయింది.
Author: IRFAN Reporter
Work from as a journalist








