బోధన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రాలేదు. అయితే కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల బరిలోకి దిగేందుకు బారసా పార్టీ నాయకులు ముందస్తుగా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌తో పాటు ఆయన అనుచరులు కూడా ఎన్నికల వ్యూహాలపై చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా వార్డు స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, బూత్ కమిటీల ఏర్పాటు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
బోధన్ పట్టణంలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని బారసా పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అధికార పార్టీల పనితీరును ప్రజల ముందు ఉంచుతూ గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తున్నరు.
కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం బోధన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బారసా పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది.
Author: IRFAN Reporter
Work from as a journalist








