బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో అక్రమ ఇసుక రవాణా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆటోలను ప్రధాన ఆయుధంగా చేసుకుని ఇసుక మాఫియా యథేచ్ఛగా దందా సాగిస్తున్నా ప్రభుత్వం యంత్రాంగం నిమ్మళంగా ఉండడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. రోజుకు వందల ట్రిప్పులుగా అక్రమంగా ఇసుక తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడనే పరిస్థితి నెలకొంది.

నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా సాగుతున్న ఈ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయ నష్టం జరుగుతుండగా, నదులు, వాగులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నా, గ్రామాల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతున్నా అధికారులు మౌన ప్రేక్షకులుగా మారారని ప్రజలు మండిపడుతున్నారు.
గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వైపు ఆటోల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా మైనింగ్, రవాణా శాఖ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయా? లేక అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఇకనైనా ప్రభుత్వం మేల్కొని అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దోషులపై వెంటనే కేసులు నమోదు చేయాలి, అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఆటోలు, వాహనాలను సీజ్ చేయాలి, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సాలూర మండలాన్ని ఇసుక మాఫియా పట్టు నుంచి విడిపించకపోతే ప్రజా ఆగ్రహం ఉప్పెనలా ఎగిసిపడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








