మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సమీక్ష సమావేశం….
నిజామాబాద్ : రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., అన్నారు.
మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని, ఎటువంటి రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో భద్రత, నమ్మకం కలిగేలా పోలీసు చర్యలు ఉండాలని, ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని తెలిపారు.
అలాగే, సోషల్ మీడియా ద్వారా వ్యాపించే వదంతులు, తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ బి. బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసిపిలు శ్రీ రాజా వెంకటరెడ్డి, శ్రీ శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్. అంజయ్య, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీ వీరయ్యతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








