V1News Telangana

best news portal development company in india

వర్నిలో విచ్చలివిడిగా మొరం తవ్వకాలు రవాణా

SHARE:

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వెనుక వడ్డేపల్లి గుట్టతో పాటు పలుచోట్ల మొరం త్రవ్వకాలు జోరుగా జరుగుతున్నప్పటికీ అనగా ప్రభుత్వ భూములు అడవి భూములలో జోరుగా మొరం త్రవ్వకాలు చేస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు రెవెన్యూ అధికారులు మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం హాలిడే అయినప్పటికీ మొరం త్రవ్వకాలు జోరుగా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరులను హరింపచేసి అధిక రేట్లకు విక్రయాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులతో పాటు మైనింగ్ శాఖ అధికారులు అటవీశాఖ అధికారులు భూములు కాపాడడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సాయన్న కు వివరణ కోరగా అనుమతులు ఏమీ లేవని తాము బాన్సువాడలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉన్నామని తెలిపారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india