జనవరి 9వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బోధన్ తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో కామ్రేడ్ కదిరే కిష్టా గౌడ్ వర్ధంతి సభను సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి వర్గ సభ్యులు ఏశాల గంగాధర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు గారు, జిల్లా మాజీ కార్యదర్శి గంగాధరప్ప గారు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. కామ్రేడ్ కదిరే కిష్టా గౌడ్ 1980 నుండి 2025 వరకు సుమారు 45 సంవత్సరాల పాటు సిపిఎం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేసి, శాఖ కార్యదర్శిగా, పట్టణ కార్యదర్శిగా, ఏరియా కమిటీ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహించారని వారు గుర్తు చేశారు.
అలాగే ప్రజాసంఘాలైన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, కల్లుగీత కార్మిక సంఘాలలో పట్టణ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వివిధ పదవులు నిర్వహిస్తూ, తన జీవితమంతా నిస్వార్థంగా ప్రజల కోసం, పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
నేటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణల పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీణం చేయడం, లేబర్ కోడ్ల ద్వారా కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారుల దోపిడికి గురిచేయడం, విద్యుత్ సంస్కరణ బిల్లు ద్వారా రైతులకు, సామాన్య కుటుంబాలకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను తొలగించి ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం పని చేయడం వంటి చర్యలు ప్రజావ్యతిరేకమని వారు విమర్శించారు.
ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మిస్తూ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు కదిరే కిష్టా గౌడ్ గారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, అదే వారికి నిజమైన నివాళి అవుతుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్, ఏరియా కార్యదర్శి వర్గ సభ్యులు ఏశాల గంగాధర్, జంగం గంగాధర్, ఏరియా కమిటీ సభ్యులు కుప్రియాల బాలయ్య, సందరి కుమారస్వామి, సుందరి సాయిలు, దండు సాయిలు, దాసి గోపి, ఆసరి లింగం, పులి ముత్తయ్య, పడాల రాజవ్వ, బిల్లా నరసింహులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








