బి. నాగమణి,( POW) ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు.
శనివారం నాడు బోధన్ పట్టణంలోని రాకాసి పేట్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ అమానుష లైంగిక దాడికి పాల్పడిన కులదీప్ సింగ్ సెంగార్ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం సరైనది కాదని, 2017లో ఉన్నావ్ పై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి కులదీప్ సింగ్ కు యావత్ జీవ శిక్షను విధించగా, అట్టి శిక్షను నిలిపివేస్తూ ఆయనను విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం సరైంది కాదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కులదీప్ కు బలమైన సంబంధాలు ఉన్న కారణంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత చూపాయని అన్నారు. న్యాయ విచారణ సందర్భంలోనే బాధితురాలి సమీప బంధువుల్ని చంపేయడం ద్వారా సాక్షాదారాలను మటుమాయం చేసే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు.అత్యాచార బాధితురాలికి సరి అయిన న్యాయం చేయాలని, కులదీప్ సింగుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు బీపాషా బేగం, మంజుల, రేణుక, జ్యోతి, కళావతి, కల్పన, సుశీల తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








