పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్, ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి, ప్రతిపక్ష నాయకులు, పార్లమెంట్ సభ్యులుగా విద్యార్థులను ఎంపిక చేసి లోక్‌సభ తరహాలో సభను నిర్వహించారు.
ఈ మాక్ పార్లమెంట్‌లో విద్యార్థులు పుస్తకాల సంచి బరువు తగ్గింపు అంశంపై విస్తృతంగా చర్చలు జరిపి, ఓటింగ్ ద్వారా తీర్మానాన్ని ఆమోదించి బిల్లును పాస్ చేశారు. సభలో విద్యార్థుల చర్చా నైపుణ్యం, వాదనాత్మక శైలి అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి సాలూరు సర్పంచ్ శ్రీమతి సొక్కం లావణ్య రవి, ఉపసర్పంచ్ బయ్యన్ సురేష్, వార్డ్ సభ్యుడు సాయినాథ్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దండు రాజ్ కుమార్, భగారే లక్ష్మి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
విద్యార్థుల సంభాషణా నైపుణ్యాలకు ఉపాధ్యాయులు మంత్రముగ్ధులయ్యారు. ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రాజీ మంజూష మాట్లాడుతూ, విద్యార్థులకు భవిష్యత్తులో మంచి రాజకీయ జీవితం ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పురానే విజయ్ కుమార్, గంధం సాయిలు, సంగీతరావు, రుద్ర సంతోష్ యాదవ్, విఠల్ కాంబ్లే, అరుణ్ కుమార్, సుధారాణి, విజయలక్ష్మి, శోభారాణి, వనజ, లింబగిరి జ్యోత్స్న, అంజన, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








