V1News Telangana

best news portal development company in india

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

SHARE:

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
బోధన్ టౌన్
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు శుక్రవారం బోధన్ పట్టణంలోని 32 వ వార్డు గ్రామ చావిడి వద్ద నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని వైద్యం కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్సు దావఖానాలు ఎంతో తోడ్పాటు అవుతున్నాయని తెలిపారు బస్తీ దవఖానాలో ప్రాథమిక వైద్యం పోటీ సేవలు మధుమేహం రక్తపోటు చికిత్సలు ఉచిత నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తారని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. ఇలా త్రిపాటి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో జిల్లా వైద్య అధికారి డాక్టర్ రాజశ్రీ.వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india