V1News Telangana

best news portal development company in india

11న మాల, ఉప సర్పంచ్ లకు సన్మానం *మాల మహానాడు ఆధ్వర్యంలో

SHARE:

ఈ నెల 11న మాల, ఉప సర్పంచ్ లకు సన్మానం
*మాల మహానాడు ఆధ్వర్యంలో
బోధన్ టౌన్, జనవరి 9:
ఇటీవల ఎన్నికల్లో నియామకమైన మాల కులస్తులైన సర్పంచులు, ఉప సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని తెలంగాణ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రాజకీయాల్లో మాలకులస్తులు తమకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవలు అందిస్తూ, చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగానే వారిని ప్రోత్సాహం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో 11వ తేదీన ఉదయం 11 గంటలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉన్నత విద్య మండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ఎట్ల నాగరాజు తదితరులు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి బోధన్, నిజాంబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గ్రామాల వారిగా సర్పంచులు, ఉపసర్పంచులుగా గెలిచిన మాల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని ఆనంపల్లి ఎల్లయ్య కోరారు. ఈ సమావేశంలో బంటు సాయిలు, రేకం దాసు, సంజీవ్ కుమార్, మీర్జాపురం సాయన్న, కారం స్వామి, బాలరాజు, రవీంద్రబాబు, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india