నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జిల్లా కలెక్టర్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు.
లయన్స్ క్లబ్ సహకారంతో, దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ యజమాని శ్రీ ఆదినారాయణ సహకారంతో బోధన్ నియోజకవర్గ పరిధిలోని 113 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ పొయ్యిలు అందజేశారు. ఈ చర్య వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో వంట సదుపాయాలు మెరుగుపడి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేందుకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








