V1News Telangana

best news portal development company in india

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ

SHARE:

బోధన్:
ఈరోజు అనగా 08 జనవరి 2026 (గురువారం) రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ – శ్రీ హరి సేవ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ సభ్యులు వేములపల్లి ఆనంద్ కుమార్ మరియు వారి సతీమణి జయ గార్లు, ఆనంద్ గిరి అక్క దమ్మాలపాటి శ్రీలత గారి జ్ఞాపకార్థం లయన్స్ హోమ్ ఫర్ ది ఏజ్డ్ లో వృద్ధులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ తన్నీరు సుబ్బారావు (MJF), ట్రెజరర్ కొత్తపల్లి నవిత, లయన్ రాజ్యలక్ష్మి, లయన్ మంజూష, లయన్ వి. ఆనంద్ తదితరులు పాల్గొని వృద్ధులను సత్కరించారు.
సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై క్లబ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india