V1News Telangana

best news portal development company in india

*ఇందూర్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

SHARE:

సంప్రదాయ శోభతో సంక్రాంతి వేడుకలు**

అలరించిన చిన్నారుల నృత్యాలు
బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని ఇందూర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను పల్లె పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించగా, విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు బోగీ మంటలు, పిండి వంటలు, హరిదాసు వేషధారణ, కోలాటాలు, జానపద నృత్యాలతో ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనలు అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కార్యక్రమానికి బోధన్ ఏసిపి శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ, డీటీఓ ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అధికారులు ముఖ్య అతిథులుగా, తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనంలోనే సంప్రదాయ విలువలను అలవర్చేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని వీటివల్ల తమ సాహిత్యాలు, సంస్కృతి, నైతిక విలువల పెంపుదలకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్‌ను, ట్రస్మా పట్టణ అధ్యక్షులు హరికృష్ణ ను అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india