V1News Telangana

best news portal development company in india

సాలూరలో తీవ్ర నీటి ఎద్దడి.

SHARE:

✍️ మురికి కాలువల లోపల నుంచి కులాయిల పైప్ లైన్ లు.
✍️ కలుషితమవుతున్న మంచినీరు.
✍️ కుళాయిల ద్వారా మంచి నీరు రాక కాలనీవాసుల ఇబ్బందులు.
✍️ 9వ వార్డులో తీవ్ర నీటి కష్టాలు.
✍️ పంచాయతీ అధికారులకు చెప్పిన తీరని నీటి కష్టాలు.
✍️ పారిశుద్ధ్య లోపాలు అంతా ఇంతా కాదు.

బోధన్ : సాలూర మండల కేంద్రంలోని 9వ వార్డులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.కాలనీవాసులు కొన్ని సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ అధికారులకు మొరపెట్టుకుంటున్న నీటి సమస్య ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా అద్దం పడుతుంది.మురికి కాలువల లోపల నుంచి కులాయిల పైప్ లైన్ లు ఉన్నాయి.లీకేజీల ద్వారా నీరు కలుషితమై రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కుళాయిల ద్వారా మంచినీరు అతి తక్కువగా వస్తుండడంతో నీళ్లు సరిపోక కాలనీ ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.అనేక సార్లు పంచాయతీ వారికి మొరపెట్టుకున్న తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదంటూ కాలనీవాసులు మండిపడ్డారు.దీంతో గురువారం కాలనీ మహిళలు నీటి సమస్య పరిష్కరించాలంటూ నిరసనకు దిగారు.అయినప్పటికీ అధికారులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తూ నీటి సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనడానికి అతిశయోక్తి లేదు.అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటూ మాట ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్ప మంచినీటి సరఫరా సమస్య పరిష్కారం మాత్రం చేయలేకపోతున్నారు.సమస్య పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారు అన్న విషయంపై అంతు పట్టడం లేదంటూ కాలనీవాసులు ఆగ్రహానికి లోనవుతున్నారు.తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించినట్లయితే డివిజన్,జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని కాలనీవాసులు హెచ్చరించారు.పారిశుద్ధ్య లోపాలు గ్రామంలో తీవ్రస్థాయికి చేరాయి.దోమల బెడద తీవ్రతరమవుతుంది.విష జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు.ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు .

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india