V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ పనులు సరే అభివృద్ధి పనులకు ఓకే 20 ఫీట్లకు పైగా లోతుల తవ్వితే ఎలా…

SHARE:

అభివృద్ధి పనుల పేరుతో రైస్ మిల్లకు తరులుతున్న మొరం
ప్రతిరోజు పొతంగల్ కోటగిరి మండలంలో అభివృద్ధి పనుల పేరుతో జోరుగా అత్యంత లోతులో మొరం త్రవ్వకాలు
అభివృద్ధి పనుల పేరుతో కొన్ని ట్రిప్పులకు పర్మిషన్ కానీ వందలు ,వేల సంఖ్యలో ట్రిప్పుల మొరం త్రవ్వకాలు
ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రతిరోజు మొరం దందా పగలు రాత్రి అనే తేడా లేకుండా పోతంగల్ ,కోటగిరి ల్లో కొనసాగుతున్న వైనం

కోటగిరి

పొతంగల్

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పలు గ్రామాల గుట్టల్లో అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో మొరం త్రవ్వకాలు పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగిస్తున్నారని మొరం మాఫీదారులు పర్మిషన్లు కొన్ని తీసుకొని వందలు ,వేల సంఖ్యల టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు, ప్రతిరోజు కోటగిరి మండల కేంద్రంలోని కొన్ని గుట్టలు ఇతర ప్రభుత్వ స్థలాల మొరం త్రవ్వకాలు జోరుగా జరుగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు అత్యంత లోతులో మొరం త్రవ్వకాలు చేస్తున్న వైనం పట్ల భూగర్భ జలాలు అడుగంటి పోవా వాల్టా చట్టానికి తూట్లు పడవ అనేక ఏండ్ల నుంచి జరుగుతున్న దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భగ్గుమంటున్నారు. వీటికి అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తూ మాముల మత్తులో ములుగుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు

 

పొతంగల్ మండలం చైతన్ నగర్ గ్రామ శివారు ప్రాంతంలో పట్టా భూములో త్రవ్వకాలు చేస్తున్నారని సుంకిని గ్రామ రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా మొరం తరలిస్తున్నప్పటికీ, రైస్ మిల్ల నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పనుల పేరుతో మొరం అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. పట్టా భూముల పేరుతో సుమారు 20 ఫీట్లకు లోతుగా తవ్వుతున్నారని ఇంత లోతులో తవ్వితే భూసారం మిస్సార వంతం కాదా భావితరాల వారికి ముప్పు వాటిల్లదా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కు వివరణ కోరగా సుంకిని రోడ్డు అభివృద్ధి పనులు భాగంగా అనుమతులు తీసుకొని మొరం తరలిస్తున్నారని సమాధానం ఇచ్చారు.‏

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india