నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సైదుపూరు తండా గ్రామ సమీపంలో అదేవిధంగా వర్ని చుట్టుపక్క గ్రామాల్లో కొనసాగుతున్న పేకాట పై జిల్లా సిపి సమాచారం అందుకొని వెంటనే స్పెషల్ పార్టీ ద్వారా కొరడా దులిపించడం జరిగింది.

దీంతో పేకాట నిర్వాహకుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయింది. స్థానికంగా ఉన్న అధికారులు ఎన్నిసార్లు కొంతమంది చెప్పిన పట్టించుకోవడంలేదని అదేవిధంగా సిపికి సమాచారం ఇవ్వడంతో సిపి వెంటనే యాక్షన్ తీసుకోవడం పట్ల, శభాష్ సిపి సాబ్ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సిపిని అభినందిస్తున్నారు. సుమారు ప్రతిరోజు 50 వేల నుంచి అనగా సుమారు రెండు నెలల నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు పేకాట నిర్వాహకులు సంపాదించినారు అనే ఒక విమర్శ, ఈ లెక్కన చూస్తే ఎంత పెద్ద మొత్తంలో ఆటలు కొనసాగడం జరిగిందో అర్థం అవుతుందని పలువురు చర్చలు చేసుకుంటున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు స్థానిక అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. ఉదయం సిపికి సమాచారం అందగానే సిపి వెంటనే స్పెషల్ పార్టీని పంపించి కొరడా దులిపించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








