Post Views: 125
జర్నలిజమా? జూద వ్యాపారమా?
పేకాట సూత్రధారిగా సోషల్ మీడియా రిపోర్టర్
పెన్ కాదు… పేకాట పట్టు!
జర్నలిస్టు పేరుతో అక్రమ జూదానికి అండ
భయపెట్టి, బెదిరించి, పేకాట నడిపిస్తున్నాడా?
సోషల్ మీడియా జర్నలిస్టుపై నిఘా డిమాండ్
మీడియా ఐడీనే ఆయుధంగా…
పేకాట నిర్వాహకులకు అండగా జర్నలిస్టు?
‘మూడు పూలు – ఆరు కాయలు’గా చెలామణి! పేకాట వెనుక జర్నలిస్టు పాత్రపై అనుమానాలు
నిజాలు రాయాల్సిన కలం… జూదానికి రక్షణ కవచమైందా?
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ పేకాట ఆటలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సబ్‌స్టేషన్‌ల సమీపాలు, గుట్టలు, అడవి ప్రాంతాలు, పంట పొలాల మధ్యలోని ఏకాంత ప్రదేశాలను అడ్డాగా చేసుకుని నిర్వాహకులు పెద్ద మొత్తంలో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం.
ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పేకాట నిర్వాహకులు (పేకాట రాయుళ్లు) లక్షల రూపాయల వరకు పంద్యాలు కాసేలా ఆటలు ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ అక్రమ జూదం వల్ల యువత దారి తప్పి, కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ పేకాటపై పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు గట్టి చర్యలు కనిపించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్థానిక అధికారులు నిర్వాహకులకు మౌన సహకారం అందిస్తున్నారా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ అక్రమ కార్యకలాపాలకు ఒక సోషల్ మీడియా జర్నలిస్టు ముసుగులో ఉన్న వ్యక్తి సహకరిస్తున్నాడని, అతడే మధ్యవర్తిగా, సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియా గుర్తింపును అడ్డుగా పెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, బెదిరింపులకు దిగుతున్నాడని, “మూడు పూలు – ఆరు కాయలు” అన్నట్టుగా వ్యవహారం నడుపుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, అక్రమ పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ కార్యకలాపాలకు సహకరిస్తున్న వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









