నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేట్, లింగీ తాండతో పాటు మోస్రా గ్రామం మరియు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో అక్రమ పేకాట ఆటలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ సరిహద్దు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని కొంతమంది నిర్వాహకులు అనేక రోజులుగా పెద్ద మొత్తంలో పేకాట నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేకాట వల్ల యువత దారి తప్పి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

అక్రమ జూదంపై ఇప్పటికే పలుమార్లు సమాచారం అందించినా, అధికారులు స్పందించకపోవడం వెనుక ఏదైనా మౌన సహకారం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేకాట నిర్వాహకులు నిర్బంధం లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం ప్రజల్లో భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తోంది.

తక్షణమే అక్రమ పేకాటపై దాడులు నిర్వహించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








