*డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పోతంగల్ సర్పంచ్ కల్లూరి సంధ్య కు సన్మానం*
పొతంగల్
పోతంగల్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కల్లూరి సంధ్య (హనుమాన్లు) కు మంగళవారం ఘనంగా సన్మానించారు. తమ డ్వాక్రా సంఘానికి చెందిన సభ్యురాలు సర్పంచ్ గా గెలవడం ఆనందంగా ఉందని డ్వాక్రా సంఘ సభ్యులు పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు పిలుపునిచ్చారు. డ్వాక్రా సంఘాల అభివృద్ధికి పాటు పడతానని ప్రతి డ్వాక్రా మహిళ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని సర్పంచ్ కల్లూరి సంధ్య (హనుమాన్లు) పేర్కొన్నారు. గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే డ్వాక్రా సంఘ సభ్యులు తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు డ్వాక్రా సిఏలు తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








