సాలురా (నిజామాబాద్ జిల్లా):
సాలురా మండల కేంద్రంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 140వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంధర్నా రవి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త అయిన సాలురా మండల కేంద్రానికి చెందిన అక్బర్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం మండల కాంగ్రెస్ నాయకులు కలిసి రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
తదుపరి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం “మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం” నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంధర్నా రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ సోక్కం లావణ్య, ఇల్తేపు శంకర్ సార్, అల్లే జనార్దన్, అల్లే రమేష్, ఖాజాపూర్ అశోక్, డిస్కో సాయిలు, బుద్దె లక్ష్మణ్, సోక్కం రవి, కుమ్మన్ పల్లి శ్రీనివాస్ రెడ్డి, సలాంపాడ్ పద్మారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సాలురా క్యాంపు రమేష్‌తో పాటు సాలురా మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








