Post Views: 59
జడ్పీహెచ్‌ఎస్ సాలూరులో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
దేశాభివృద్ధికి వ్యవసాయమే వెన్నెముక – వక్తల స్పష్టం..
సాలూరు మండలంలోని పియం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్) సాలూరులో శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించి, విద్యార్థులకు వ్యవసాయ రంగ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ “రైతు లేనిదే రాజ్యం లేదు. దేశాభివృద్ధికి వ్యవసాయమే వెన్నెముక. భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో ప్రపంచంలో ముందంజలో ఉంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతోంది” అని తెలిపారు. రైతులు విద్యార్థులకు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, అవకాశాలు, భవిష్యత్ అవసరాలపై విలువైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ జ్యోత్స్న గారితో పాటు ఉపాధ్యాయులు శోభారాణి, విజయలక్ష్మి, లక్ష్మి, స్వర్ణలత పాల్గొన్నారు. అలాగే గందం సాయిలు, దండు రాజ్‌కుమార్, కాముని స్వామి, మహేశ్వర్ రావు, అక్షయ్ జాదవ్, మేడి రవి పాల్గొన్నారు. సాలూరు గ్రామానికి చెందిన రైతులు రవి, సుభాష్, బీమయ్య, హనుమండ్లు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








