V1News Telangana

best news portal development company in india

మంజీరా ఇసుకతో ట్రాక్టర్ల రాజ్యం – ప్రజల ప్రాణాలకు ముప్పు అధికారుల మౌనంతో పాటు కొంత మీడియాపై అనుమానాలు..

SHARE:

ఇసుక మాఫియా దాటికి గ్రామస్తుల గర్జన
తగ్గేల్లిలో పశువులతో రహదారి దిగ్బంధం
🔻
మంజీరా ఇసుకతో ట్రాక్టర్ల రాజ్యం – ప్రజల ప్రాణాలకు ముప్పు
అధికారుల మౌనంతో పాటు కొంత మీడియాపై అనుమానాలు

సాలురా మండలం తగ్గేల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ సరిహద్దులోని మంజీరా నది నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తూ రోజంతా రహదారులపై తిరగడంతో గ్రామజీవితం తీవ్రంగా అస్తవ్యస్తమవుతోంది.
ఉదయం వేళ ఇళ్ల నుంచి పశువులను పొలాలకు తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ల వేగవంతమైన రాకపోకల కారణంగా ప్రాణభయంతో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి స్పందన లేకపోవడం గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామస్తులు పశువులను రహదారిపై నిలిపి ఇసుక ట్రాక్టర్ల రాకపోకలను అడ్డుకుంటూ నిరసన చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఇసుక అక్రమ రవాణాపై కొన్ని మీడియా వర్గాలు చూపుతున్న వైఖరిపై కూడా గ్రామంలో చర్చ జరుగుతోంది. అక్రమ రవాణా కొనసాగుతున్నప్పటికీ, నెలల తరబడి మౌనం పాటించి, కొన్నిసార్లు మాత్రమే వార్తలు రావడం వెనుక ఏదైనా అవగాహనలున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా నిజంగా ప్రజాపక్షాన నిలుస్తుందా? లేక లేక వారి స్వార్థం. కొరకు ప్రతి నెల మామూలు కొరకు. నెల ఆఖరు అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తుందా? అన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేసి, రహదారుల భద్రతను కల్పించడంతో పాటు అధికారులు, మీడియా – రెండూ బాధ్యతతో వ్యవహరించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్పందన లేకపోతే నిరసన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india