V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో డబుల్ బెడ్‌రూమ్ దోపిడీ! అనర్హుల చేతిలో పేదల ఇళ్లు — ఎమ్మెల్యే మౌనం ఎందుకు? 

SHARE:

బోధన్‌లో డబుల్ బెడ్‌రూమ్ దోపిడీ!
అనర్హుల చేతిలో పేదల ఇళ్లు — ఎమ్మెల్యే మౌనం ఎందుకు? 
విలేకరుల జాగాల పేరుతో అక్రమ కబ్జాలు!
డబుల్ బెడ్‌రూమ్ బిల్లులు వెంటనే స్వాధీనం చేయాలి: అశోక్
 పేదల హక్కులపై దోపిడీ రాజ్యం!
బోధన్‌లో అనర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు — చర్యలు ఎప్పుడు?

–ఆచంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అనర్హులైన వ్యక్తులు అక్రమంగా విలేకరుల జాగాలు పొందడం, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బిల్లులు కూడా చట్ట విరుద్ధంగా పొందడం సిగ్గుచేటని సామాజిక కార్యకర్త అశోక్ తీవ్రంగా విమర్శించారు.

నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకాన్ని కొందరు అక్రమంగా దుర్వినియోగం చేస్తూ, నిజమైన పేదలను పక్కన పెట్టడం అన్యాయమని అన్నారు. అక్రమంగా పొందిన డబుల్ బెడ్‌రూమ్ బిల్లులను వెంటనే స్వాధీనం చేసుకుని, అర్హతలేని వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి, ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన నిరుపేద రిపోర్టర్లు, పేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అశోక్ స్పష్టం చేశారు.

 

 

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని పాండుపారం–ఆచంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అనర్హులైన వ్యక్తులు అక్రమంగా విలేకరుల జాగాలు పొందడం, అదే విధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బిల్లులు కూడా అన్యాయంగా దక్కించుకోవడం సిగ్గుచేటని సామాజిక కార్యకర్త అశోక్ తీవ్రంగా మండిపడ్డారు.

పేదలు, నిరుపేదల కోసం ప్రభుత్వము నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ పథకాన్ని దోపిడీకి వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు. అర్హతలేని వారు అధికారుల అండదండలతో ఇళ్లను దక్కించుకుంటుండగా, నిజమైన నిరుపేదలు మాత్రం ఇప్పటికీ గుడిసెల్లోనే బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమంగా పొందిన డబుల్ బెడ్‌రూమ్ బిల్లులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అనర్హులపై కఠిన చర్యలు తీసుకుని వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన నిరుపేద రిపోర్టర్లకు, పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా చర్యలు తీసుకోవాలని అశోక్ కోరారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల హక్కులను కాపాడుతుందా? లేక అక్రమాలకు తలవంచుతుందా? అన్న ప్రశ్న బోధన్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india