– పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్న బిజెపి నాయకులు
– ఉత్కంఠ పోరు లో నెమ్లి గ్రామంలో బిజెపి సర్పంచ్ అభ్యర్థి, కామ్ షెట్ పల్లి గ్రామంలో ఉపసర్పంచ్ అభ్యర్థుల గెలుపు
– మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సహకారం అందచేత
– గెలుపొందిన అభ్యర్థులను అభినందించిన బిజెపి నాయకులు,NRI కోనేరు శశాంక్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, డిసెంబర్(19) కామారెడ్డి జిల్లా: మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల పరిధిలోని నెమ్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు. అదేవిధంగా కామ్ శెట్ పల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ తరపున బలపరిచిన ఉపసర్పంచ్ అభ్యర్థి గుడ్లా వార్ రామ్మోహన్ గెలుపొందారు. గతంలో ఎన్నడూ ఈ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.. బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే మొగ్గు చూపుతూ నాయకులు భారతీయ జనతా పార్టీని విస్మరించేవారు.. అలాంటి పరిస్థితుల నుండి బిజెపి జిల్లా నాయకులు సున్నం సాయిలు నాయకత్వంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి మునుపెన్నడూ లేని విధంగా నసురుల్లాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బిజెపి పార్టీ తరఫునుండి సర్పంచ్ అభ్యర్థులను మరియు వార్డు మెంబర్లను బరిలో నిలిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సున్నం సాయిలు మంచి నాయకత్వ లక్షణాలతో అందరి మన్ననలు పొందుతున్నారు.. గురువారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మరియు NRI కోనేరు శశాంక్ లు కార్యకర్తలతో కలిసి నూతన సర్పంచ్ అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన మనము చిత్తశుద్ధితో.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో తోడ్పడాలని నూతనంగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు సూచించారు. అంతేకాకుండా నిరు పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు.. అనంతరం గత కొద్ది రోజుల క్రితం నెమ్లి గ్రామానికి చెందిన కర్రి హన్మండ్లు అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయంలో మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తామని నెమ్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి, చందూర్ సాయిలు, లక్ష్మణ్ లు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని బిజెపి బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికి రూ. 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, అరిగె నారాయణ, చందూర్ సాయిలు, లక్ష్మణ్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








