పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గం
ప్రారంభించిన 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి వరూధిని
బోధన్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మంగళవారం మధ్యవర్తిత్వ కేంద్రాన్ని 5వ అదనపు జిల్లా మరియు మండల న్యాయ సేవ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి వరూధిని ప్రారంభించారు.
ఈ మధ్యవర్తిత్వ కేంద్రానికి న్యాయవాది జి. ధర్మయ్యను న్యాయ సేవా సంస్థ, హైదరాబాద్ ద్వారా ఇటీవల నియమించారు. న్యాయస్థాన పరిధిలో పెండింగ్‌లో ఉన్న సివిల్ మరియు క్రిమినల్ కేసుల్లో పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని సంబంధిత కోర్టులు ఈ మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపిస్తాయని న్యాయమూర్తి తెలిపారు.
కక్షిదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, తక్కువ సమయంలో స్నేహపూర్వకంగా వివాదాలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. దీని ద్వారా న్యాయస్థానాలపై భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు సులభమైన న్యాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎం. పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాయి శివ, స్పెషల్ మ్యాజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ శేష తల్ప సాయి, బోధన్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి కోటేశ్వరరావు, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గౌస్ ఉద్దీన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి. శ్యామ్ రావు, డా. పి. సమ్మయ్య, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బి. రవీందర్, సీనియర్ న్యాయవాదులు గంగారెడ్డి, రమేష్, కాశీం బాషా, అడ్లూరి శ్రీనివాస్, కళ్యాణి, అజార్తో పాటు న్యాయశాఖ ఉద్యోగులు, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








