బోధన్‌లో చెత్త సేకరణకు 15 నూతన ఆటోలు ప్రారంభించిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
బోధన్ పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కోరారు.

మంగళవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చెత్త సేకరణ కోసం మున్సిపాలిటీ ద్వారా కొనుగోలు చేసిన 15 నూతన ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులలో ఇంటింటి నుంచి చెత్త సేకరించేందుకు ఈ ఆటోలను నూతనంగా కొనుగోలు చేసి ప్రారంభించామని తెలిపారు.

ఇప్పటి నుంచి చెత్త సేకరణ ఆటోలు ప్రతి ఇంటి వద్దకే వస్తాయని, పట్టణ ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా ఆటోలలోనే వేయాలని సూచించారు. మున్సిపాలిటీకి సంబంధించిన పన్నులు ప్రజలు సకాలంలో చెల్లించినట్లయితే పట్టణాభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని స్పష్టం చేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన చెత్త సేకరణ ఆటోలను సక్రమంగా వినియోగించుకుని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, మున్సిపాలిటీ భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు అన్ని విధాల చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








