ప్రభుత్వ భూముల కబ్జాలపై ఎందుకీ మౌనం?
వెనుక ఎవరి అండదండలు?
నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా
నోటీసులకే పరిమితమైన చర్యలపై ఆగ్రహం..
మాజీ ఉపసర్పంచ్ సరిడే సాయిలు –

నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉపసర్పంచ్ సరిడే సాయిలు డిమాండ్ చేశారు. మంగళవారం కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం ముందు ఆయన ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సరిడే సాయిలు తహసీల్దార్ (ఎంఆర్ఓ) శశిభూషణ్, పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డిలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. సాలూరు మండలం పానది పరిధిలోని ఈ ప్రభుత్వ భూమి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అక్రమ కబ్జాను వెంటనే తొలగించి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ శశిభూషణ్ మాట్లాడుతూ, అక్రమ కబ్జాదారుడికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు స్పందించక అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. పోలీసుల సహాయంతో ప్రస్తుతం నిర్మాణ పనులను నిలిపివేశామని, అయినా వినిపించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.అయితే, నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో గతంలోనూ ప్రభుత్వ భూముల కబ్జాలపై నోటీసులు జారీ చేసి చర్యలు శూన్యంగా మారిన ఘటనలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నోటీసులిచ్చి చేతులు దులుపుకోవడం తప్ప వాస్తవ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఇంత బహిరంగంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వెనుక ఎవరి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కళ్లముందే కబ్జాలు జరుగుతుంటే ఎందుకు కళ్లుమూసుకుని ఊరుకుంటున్నారని ప్రజలు నిలదీస్తున్నారు.ఈ కబ్జాలకు ఎవరి రాజకీయ అండదండలు ఉన్నాయో స్పష్టంగా బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








