Post Views: 82
సాలూర, డిసెంబరు 15: అత్యవసర వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని సాలూర మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్‌కుమార్ 108 అంబులెన్స్ సిబ్బందిని హెచ్చరించారు.

సోమవారం సాలూరకు చెందిన 108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, రికార్డులను పరిశీలించారు. అంబులెన్స్‌లో అన్ని అత్యవసర సౌకర్యాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులకు అందిస్తున్న సేవలపై ఈఎంటీ రాధాకృష్ణ, పైలెట్ వెంకట్రాజుతో చర్చించారు. తనిఖీలో వైద్యాధికారి వెంకట రమణ, ఫార్మాసిస్టు పీహెచ్ఎన్ ఇందిరా పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








